Telangana: తెలంగాణ వస్తే ఆత్మహత్యలు ఉండవని కేసీఆర్ చెప్పారు.. ఇప్పుడు పరిస్థితి వేరుగా వుంది!: వీహెచ్

  • ప్రభుత్వ తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
  • రోజు రోజుకు రెవెన్యూ సమస్యలు తీవ్రం అవుతున్నాయి
  • రైతులకు హక్కులు ఉన్నా పట్టాలు రావట్లేదు
తెలంగాణ వస్తే ఆత్మహత్యలు ఉండవని అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని, అయితే, ఆయన పాలనలో ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని రైతులకు న్యాయం జరగట్లేదని వీహెచ్ అన్నారు. రోజు రోజుకు రెవెన్యూ సమస్యలు తీవ్రతరం అవుతున్నాయని అన్నారు. రైతులకు హక్కులు ఉన్నా పట్టాలు రావట్లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన చలో ట్యాంక్ బండ్ విజయవంతమైందని చెప్పారు.
Telangana
KCR
VH

More Telugu News