Krishna: కృష్ణ ..శోభన్ బాబుల మధ్య తేడా అదే: దర్శక, నిర్మాత చిట్టిబాబు

  • శోభన్ బాబుకి ఆలస్యంగా స్టార్ డమ్ వచ్చింది 
  • ఆయన కచ్చితంగా ఉండటానికి కారణమదే 
  •  అందువల్లనే కృష్ణ నిర్మాతగా మారారన్న చిట్టిబాబు
తాజా ఇంటర్వ్యూలో సీనియర్ దర్శక, నిర్మాత చిట్టిబాబు మాట్లాడుతూ శోభన్ బాబు .. కృష్ణ గురించి ప్రస్తావించారు. ఎవరిలో చూడని జాగ్రత్త .. బాధ్యతను నేను శోభన్ బాబుగారిలో చూశాను. సినిమాకి సంబంధించి తనకి సంబంధించిన వర్క్ విషయంలో ఆయన ఎంతో బాధ్యతగా ఉండేవారు. లేట్ గా స్టార్ డమ్ రావడం వలన డబ్బు విషయంలో ఆయన కచ్చితంగా ఉండేవారు. చివరి రూపాయి ఇస్తేనే గాని ఆయన డబ్బింగ్ చెప్పేవారు కాదు. సాయంత్రం 6 కాగానే ఆయన 'విగ్' తీసేసేవారు. ఈ విషయాలన్నీ ఆయన ముందుగానే మాట్లాడుకుని ఆ ప్రకారమే చేసేవారు.

ఇక కృష్ణగారు ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేవారు. ఆయన సమయాన్ని గురించి పట్టించుకునేవారు కాదు. రాత్రి 11 అయినా .. 12 అయినా షూటింగులోనే ఉండేవారు. నిర్మాతల అవసరాలను ఆయన దృష్టిలో పెట్టుకునేవారు. భారీ బడ్జెట్ సినిమాలు సక్సెస్ కాకపోతే వచ్చే నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందువలన ఇతర నిర్మాతలను ఇబ్బందులు పెట్టకుండా తనే నిర్మాతగా మారేవారు" అని చెప్పుకొచ్చారు.
Krishna
Sobhan Babu

More Telugu News