Maharashtra: అరవింద్ సావంత్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి
- కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రకాశ్ జవదేకర్ కు అదనపు బాధ్యతలు
- రాష్ట్రపతి కార్యాలయం నుంచి ప్రకటన
- మహారాష్ట్రలో గంటకో మలుపు తిరుగుతోన్న రాజకీయ పరిణామాలు
మహారాష్ట్రలో బీజేపీతో విభేదాల కారణంగా శివసేన నేత అరవింద్ సావంత్.. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించారు. ఆయన స్థానంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రకాశ్ జవదేకర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది.
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిణామాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన శివసేన ఎంపీ అరవింద్ సావంత్ నిన్న మీడియాతో మాట్లాడుతూ.. తాము ప్రతిపాదించిన 50-50 ఫార్ములాపై బీజేపీ మాట మార్చిందని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అందువల్లే తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశానని ఆయన స్పష్టం చేశారు.