పింఛన్ ఇవ్వకపోతే పెట్రోలు పోసి తగలెట్టేస్తాం!.. అనంతపురం జిల్లాలో పింఛనుదారుల బెదిరింపులు
- పింఛన్ కోసం పంచాయతీ కార్యదర్శితో వాగ్వివాదం
- వచ్చే నెల నుంచి ఇవ్వకపోతే పెట్రోలు పోసి తగలబెట్టేస్తామని హెచ్చరిక
- కొడవలితో కార్యాలయంలోకి మహిళ
సమాచారం అందుకున్న పోలీసులు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని పెన్నోబులేశు, శివమ్మతోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. శివమ్మ కార్యాలయంలోకి వెళ్లిన సమయంలో ఆమె చేతిలో కొడవలి ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శివమ్మ కొడవలితో అక్కడికి ఎందుకు వెళ్లిందన్న విషయంపై ఆరా తీస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కార్యదర్శి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.