Bangladesh: గెలవాల్సిన మ్యాచ్ ను లాగేసుకున్నారు: బంగ్లాదేశ్ కెప్టెన్

  • నాగ్ పూర్ టి20లో ఓటమిపై మహ్మదుల్లా విశ్లేషణ
  • భారత బౌలర్లపై ప్రశంసలు
  • వరుసగా వికెట్లు తీసి ఓటమి పాల్జేశారంటూ వ్యాఖ్యలు
భారత్ తో నాగ్ పూర్ లో జరిగిన చివరి టి20లో బంగ్లాదేశ్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీపక్ చహర్ హ్యాట్రిక్ విజృంభణ, శివం దూబే సమయోచిత బౌలింగ్ తో బంగ్లాదేశ్ జట్టు గెలుపు ముంగిట బోల్తా పడింది. దీనిపై బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా ఆవేదన వ్యక్తం చేశాడు. విజయం దిశగా వెళుతున్న తమను భారత బౌలర్లు దెబ్బకొట్టారని అభిప్రాయపడ్డాడు. మహ్మద్ నయీం, మిథున్ లు ఇన్నింగ్స్ ను నిర్మించి, అంతా సజావుగా ఉందనుకున్న తరుణంలో భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీసి తమ గెలుపు ఆశలపై నీళ్లు చల్లారని తెలిపాడు.

నయీం, మిథున్ అవుట్ కావడంతో మ్యాచ్ తమ చేజారిందని మహ్మదుల్లా విశ్లేషించాడు. అయితే ఈ మ్యాచ్ ద్వారా తమకు కొన్ని సానుకూల ఫలితాలు వచ్చాయని, మహ్మద్ నయీం తన ప్రతిభను నిరూపించుకోగలిగాడని, ఒత్తిడిలో తాను ఎంత మెరుగైన ఆటతీరు కనబరుస్తాడో చాటిచెప్పాడని కెప్టెన్ కితాబిచ్చాడు.
Bangladesh
India
Mahadullah
Cricket

More Telugu News