uddav thakre: సీఎం పీఠంపై ఉద్ధవ్ థాకరే?... కాంగ్రెస్, ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవులు?

  • ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధం?
  • శివసేనకు మద్దతు ఇచ్చేందుకే ఎన్సీపీ సానుకూలం
  • శరద్ పవార్ ను కలిసేందుకు బయలుదేరిన ఉద్ధవ్ థాకరే
మహారాష్ట్ర రాజకీయాలు మహా మలుపులు, ఊహించని ట్విస్ట్ లతో ఉత్కంఠ రేపుతున్నాయి. సీఎం పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలని, వర్లి నుంచి పోటీ చేసిన ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ ముందు ఇటీవల శివసేన డిమాండ్ ను ఉంచిన విషయం తెలిసిందే. బీజేపీ ఇందుకు నిరాకరించడంతో ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.

శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే.. మహారాష్ట్ర సీఎం పదవి చేపడతారని ఊహాగానాలు మొదలయ్యాయి. కాంగ‌్రెస్, ఎన్సీపీకి చెరో ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని లీకులు వచ్చాయి. శివసేనకు మద్దతు ఇచ్చేందుకే ఎన్సీపీ సానుకూలంగా ఉందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నిర్ణయం కోసం ఎన్సీపీ ఎదురు చూస్తోంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిసేందుకు ఉద్ధవ్ థాకరే తన నివాసం నుంచి బయలుదేరారు.
uddav thakre
Maharashtra
BJP

More Telugu News