Payyavula Keshav: పయ్యావుల కేశవ్ ను పరామర్శించిన చంద్రబాబు

  • ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నాను
  • కేశవ్ గారు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాను
  • ఫేస్ బుక్ ద్వారా తెలిపిన చంద్రబాబు
ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ ప్రజా పద్దుల సంఘం ఛైర్మన్‌ (పీఏసీ) పయ్యావుల కేశవ్‌ స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అమరావతిలో పీఏసీ సమావేశం జరుగుతుండగా ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఆయనను ఇటీవల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించి, కొద్ది సేపు మాట్లాడారు. వైద్యులతోనూ మాట్లాడి పయ్యావుల కేశవ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
  'అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ గారిని, వారి కుటుంబసభ్యులను పరామర్శించాను. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నాను. కేశవ్ గారు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాను' అని చంద్రబాబు ఫేస్ బుక్ ద్వారా తెలిపారు.
Payyavula Keshav
Chandrababu
Telugudesam

More Telugu News