పార్టీ నేతలతో వేర్వేరుగా సోనియా, శరద్ పవార్ కీలక భేటీ.. కాసేపట్లో కీలక ప్రకటన
- ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ
- ముంబయిలో ఎన్సీపీ ఎమ్మెల్యేలతో శరద్ పవార్ భేటీ
- శివసేనకు మద్దతుపై కీలక చర్చలు
ముంబయిలో ఎన్సీపీ ఎమ్మెల్యేలతో శరద్ పవార్ సమావేశమయ్యారు. మహారాష్ట్రలో తాజా పరిణామాలు, శివసేనకు మద్దతు వంటి పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఇందులో ప్రపుల్ పటేల్, సుప్రియా సూలేతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. అంతేగాక, బీజేపీ, శివసేన పార్టీలు కూడా తమ తమ ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నాయి.