TSRTC: టీఎస్‌ ఆర్‌టీసీ సమ్మెకు ప్రవాస భారతీయుల మద్దతు

  • వాషింగ్టన్‌లో ఈ మేరకు ప్రకటన
  • అక్కడ జరుగుతున్న తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం సమావేశాలు
  • సమావేశాల్లో ఆర్టీసీని రక్షించాలంటూ నినాదాలు
నలభై ఏడు రోజులుగా జరుగుతున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అమెరికాలోని ప్రవాస భారతీయులు మద్దతు తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం సమావేశాలు ప్రస్తుతం అమెరికాలోని వాషింగ్టన్‌లో జరుగుతున్నాయి. ఈ సమావేశానికి మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ హాజరయ్యారు.

ఈ సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తుండగా అనూహ్య ఘటన ఎదురైంది. సభకు హాజరైన వారిలో కొందరు ఎన్‌ఆర్‌ఐలు లేచి నిలబడి ‘తెలంగాణ ఆర్టీసీని రక్షించండి...రక్షించండి’ అంటూ నినాదాలు చేయడంతో ఆశ్చర్యపోవడం వినోద్‌ వంతయింది. ఈ అంశం కారణంగా కాసేపు సభలో గందరగోళం నెలకొంది. అయితే నిర్వాహకులు సర్దిచెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు.
TSRTC
NRI's
washington
g.vinod

More Telugu News