america: అమెరికా అబ్బాయిని పెళ్లాడిన మహబూబ్‌నగర్ అమ్మాయి!

  • నాలుగేళ్ల క్రితం డాలస్ వెళ్లిన వర్షిణి
  • సహోద్యోగి హెన్రీ గిన్స్‌తో ప్రేమ
  • హైదరాబాద్‌లో ఒక్కటైన జంట
మహబూబ్‌నగర్‌కు చెందిన వర్షిణి, అమెరికాలోని డాలస్‌కు చెందిన హెన్రీ గిన్స్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్‌, బేగంపేటలోని టూరిజం ప్లాజాలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నాలుగేళ్ల క్రితం డాలస్ వెళ్లిన వర్షిణి అక్కడి క్యాపిటల్ వన్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. అదే సంస్థలో సీనియర్ అయిన తన సహోద్యోగి హెన్రీ గిన్స్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించారు. అనంతరం హైదరాబాద్ చేరుకుని హిందూ సంప్రదాయం ప్రకారం నిన్న ఉదయం 11: 15 గంటలకు వివాహం చేసుకున్నారు. వరుడు హెన్రీ గిన్స్ తరపున ఆయన తల్లి, సోదరుడు హాజరయ్యారు. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దగ్గరుండి వీరి వివాహాన్ని జరిపించారు.
america
Mahabubabad District
marriage
dallas

More Telugu News