fish: రూపాయికే కిలో చేపలంటూ ప్రచారం.. కిక్కిరిసిన జనం

  • కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వ్యక్తి
  • తొలి వందమందికి రూపాయికే కిలో చేపల విక్రయం
  • ఇడ్లీ బామ్మే తనకు ఆదర్శమన్న వ్యాపారి
కొత్తగా చేపల దుకాణాన్ని ప్రారంభించిన వ్యక్తి తన వ్యాపారం గురించి అందరికీ తెలిసేందుకు వినూత్న ప్రచారం చేశాడు. రూపాయికే కిలో చేపలంటూ ప్రచారంతో హోరెత్తించాడు. అంతే.. జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు. దుకాణం ప్రారంభం రోజున ఉదయం నుంచే షాపు ముందు జనం పెద్ద ఎత్తున బారులు తీరారు. చేపలు దక్కించుకునేందుకు పోటీపడ్డారు. తమిళనాడులోని శివగంగ జిల్లా కరైకుడిలో జరిగిందీ ఘటన.

తొలి వందమందికి రూపాయికే కిలో చేపలు ఇవ్వనున్నట్టు చేసిన ప్రచారం ఆయనకు విపరీతంగా కలిసి వచ్చింది. జనం ఎగబడడంతో తన ప్రయోగం ఫలించిందని వ్యాపారి చెప్పుకొచ్చాడు. తన షాపునకు విపరీతమైన ప్రచారం లభించిందని ఆనందం వ్యక్తం చేశాడు. రూపాయికే ఇడ్లీ అమ్ముతున్న బామ్మే తనకు ఆదర్శమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నాడు. మరోవైపు, ఆయన వద్ద చేపలు కొన్న జనం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
fish
Tamil Nadu
one rupee
business

More Telugu News