Bigg Boss: బిగ్ బాస్ ఇంట్లో నేను చేసిన పొరబాటు అదొక్కటే: వరుణ్ సందేశ్

షార్ట్స్‌లో చూడండి
బిగ్ బాస్-3 కంటెస్టెంట్ వరుణ్ సందేశ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. చిత్ర పరిశ్రమలో తాను ఎదుర్కొన్న అనుభవాలతో పోల్చితే బిగ్ బాస్ ఇంట్లో జరిగినవి చాలా చిన్నవని అభిప్రాయపడ్డాడు. అయితే ఇటుకల టాస్క్ సందర్భంగా తనకు, రాహుల్ సిప్లిగంజ్ కు మధ్య స్వల్ప వివాదం జరిగిందని తెలిపాడు. వితిక కూడా ఇన్వాల్వ్ అయిన ఆ గొడవకు సంబంధించి వీడియో ఫుటేజ్ చూడాలని రాహుల్ ప్రతిపాదించాడని, అయితే తాను "ఇంతకుముందు హిమజ విషయంలో కూడా ఇలాగే అన్నావు రాహుల్" అన్నానని వరుణ్ వెల్లడించాడు.

తాను ఆ మాట అనుకుండా ఉండాల్సిందని ఆ తర్వాత అనిపించిందని వివరించాడు. హౌస్ లో తాను చేసిన పొరబాటు ఏదైనా ఉందంటే ఇదొక్కటేనని స్పష్టం చేశాడు. ఇక తన గురించి అపోహ పడిన జాఫర్, తమన్నా షో చివర్లో "మీ గురించి తప్పుగా అనుకున్నాం, ఇప్పుడు మీపై మరింత గౌరవం పెరిగింది" అనడం ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని వరుణ్ తెలిపాడు.
Go Back to Shorts
Bigg Boss
Varun Sandesh
Rahul Sipligunj

More Telugu News