Bigg Boss: పక్షులు వస్తే రాళ్లనుకుని పట్టుకోబోయాను: బిగ్ బాస్ ఇంట్లో తన అనుభవాలు వెల్లడించిన వరుణ్ సందేశ్

  • ముగిసిన బిగ్ బాస్ మూడో సీజన్
  • ఫైనల్స్ చేరుకున్న వరుణ్ సందేశ్
  • టాస్క్ లో తన అగచాట్లను మీడియాకు వెల్లడి
బిగ్ బాస్-3 రియాల్టీ షో ఇటీవలే ముగిసింది. టాలీవుడ్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. హీరో వరుణ్ సందేశ్ కూడా ఫైనల్ రౌండ్ వరకు గట్టిపోటీనే ఇచ్చినా టాప్-5లో ఒకడిగా మిగిలిపోయాడు. ఇక హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తన భార్య వితికతో కలిసి ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. బిగ్ బాస్ ఇంట్లో తనకెదురైన అనుభవాలను అందరితో పంచుకున్నాడు.

విజయదశమి సమయంలో రాళ్లు ఏరే టాస్క్ ఇచ్చారని, ఆ టాస్క్ లో తాను కళ్లజోడు లేకుండా పాల్గొన్నానని వరుణ్ తెలిపాడు. కళ్లద్దాలు మర్చిపోయి టాస్క్ లో దిగడంతో చాలా ఇబ్బంది పడ్డానని, ఓ దశలో కంటి ముందున్నవి సరిగ్గా కనపడక తడుముకోవాల్సి వచ్చిందని తెలిపాడు. బిగ్ బాస్ ఇంటి మీదుగా పక్షులు వెళుతుంటే అవే రాళ్లు అనుకుని పట్టుకోబోయానని వెల్లడించాడు. తన పాట్లు చూసి బిగ్ బాస్ ఇంట్లో అరగంట పాటు ఆపకుండా నవ్వుకున్నారని చెబుతూ తాను కూడా నవ్వేశాడీ టాలీవుడ్ రొమాంటిక్ హీరో.
Bigg Boss
Varun Sandesh
Rahul Sipligunj

More Telugu News