Nara Lokesh: విజన్ ఉన్న లీడర్ కు, ఒంటినిండా పాయిజన్ ఉన్న లీడర్ కు తేడా ఇదే!: నారా లోకేశ్

  • ట్విట్టర్లో లోకేశ్ విమర్శనాస్త్రాలు
  • పట్టిసీమ నేపథ్యంలో విసుర్లు
  • పనికిరాని పట్టిసీమ అన్నవాళ్లే మోటార్లు ఆన్ చేశారని ఎద్దేవా
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. విజన్ ఉన్న లీడర్ కు, ఒంటి నిండా పాయిజన్ ఉన్న లీడర్ కు తేడా ఇదేనంటూ పట్టిసీమ ప్రాజెక్టు నేపథ్యంలో వ్యాఖ్యలు చేశారు. విజన్ ఉన్న లీడర్ రాబోయే సంక్షోభాన్ని ముందే పసిగట్టి నివారణ చర్యలు తీసుకుంటారని, పట్టిసీమ ప్రాజెక్టు అలాంటి ఆలోచన నుంచి పుట్టిందేనని వెల్లడించారు.

ఇక ఒంటినిండా పాయిజన్ ఉన్న లీడర్ ముందు చూపు లేక, వరదలు వచ్చినా వినియోగించుకోలేక, ప్రజల్ని ముంచి నీటిని సముద్రం పాలుచేస్తారని విమర్శించారు. ఎగువ రాష్ట్రాల నుంచి ఎంత వరద వచ్చినా సద్వినియోగం చేసుకోలేక, చివరికి పనికిరాని పట్టిసీమ అన్నవాళ్లే మోటార్లు ఆన్ చేసి నీటిని అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు.
Nara Lokesh
Telugudesam
Andhra Pradesh
Pattiseema

More Telugu News