Vijayawada: కనకదుర్గమ్మకు చంద్రముఖి బంగారు గొలుసు విరాళం!

  • నిత్యాలంకారం నిమిత్తం విరాళం
  • వైభవంగా జరుగుతున్న భవానీల మాలధారణ
  • పోటెత్తిన భక్తులు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు అరుదైన ఆభరణం విరాళంగా వచ్చింది. నగరంలోని సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ వాసి మందల మేఘన సాయి, చంద్రముఖి బంగారు గొలుసును నిత్యమూ అలంకరించే నిమిత్తం అందజేశారు. ఆలయ అధికారులకు ఆయన గొలుసును విరాళంగా ఇవ్వగా, దాతలకు దుర్గమ్మవారిని ప్రత్యేకంగా దర్శనం చేయించిన అధికారులు, వేద పండితులతో ఆశీర్వచనం ఇప్పించారు.

ఆపై అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు. ఇదిలావుండగా, ఆలయంలో భవానీ దీక్షల మాలధారణ కార్యక్రమం మూడవ రోజు వేడుకగా జరుగుతోంది. మాల విరమణకు భక్తులు పోటెత్తగా, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
Vijayawada
Gold Chain
Kanakadurgamma

More Telugu News