Andhra Pradesh: డిసెంబర్ మొదటివారంలో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

  • మరో రెండు రోజుల్లో తేదీలు ఖరారు
  • సభలోకి పలు ముఖ్యమైన బిల్లులు
  • సిద్ధమవుతున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను డిసెంబర్ తొలి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, సమావేశ తేదీలను ప్రకటించలేదు. మరో రెండు రోజుల్లో ఈ తేదీలను ఖరారు చేయనున్నట్లు తెలిపింది. ఏడాదికి కనీసం రెండు సార్లు సమావేశం కావాల్సిన అసెంబ్లీ జూన్ లో వర్షాకాల సమావేశాలను నిర్వహించింది.

రెండు సమావేశాల మధ్య విరామం ఆరునెలలు మించకూడదన్న నేపథ్యంలో తాజాగా వచ్చే నెల తొలివారంలో శీతాకాల సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ సమావేశాల్లో పలు మఖ్యమైన బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇందులో ముఖ్యమైన ఇసుక విధానానికి సంబంధించి బిల్లు కూడా ఉంది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు తగిన సమాచారంతో సిద్ధమవుతున్నారు.
Andhra Pradesh
Assembly
Winter session
Bigin in December 1st week

More Telugu News