Ayodhya: అయోధ్య తీర్పు నేపథ్యంలో మీడియాకు మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం

  • అయోధ్య వివాదంపై సుప్రీం తీర్పు
  • ప్రోగ్రామ్ కోడ్ కచ్చితంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు
  • అన్ని చానళ్లకు, కేబుల్ ఆపరేటర్లకు వర్తిస్తుందన్న కేంద్రం
దేశంలో అతిపెద్ద మతపరమైన వివాదంగా పేరుగాంచిన అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలను నిరోధించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాకు మార్గదర్శకాలు జారీచేసింది. చానళ్లలో చేపట్టే చర్చా కార్యక్రమాలు, డిబేట్లు, రిపోర్టింగ్ సందర్భంగా ప్రోగ్రామ్ కోడ్ ను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. చానళ్లతో పాటు కేబుల్ టీవీ ఆపరేటర్లు కూడా ప్రోగ్రామ్ కోడ్ ను పాటించాలని స్పష్టం చేసింది. ఇది అన్ని చానళ్లకు, దేశంలోని అందరు కేబుల్ ఆపరేటర్లకు వర్తిస్తుందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Ayodhya
Supreme Court
Media

More Telugu News