Chandrababu: సుప్రీం ఏకగ్రీవ నిర్ణయాన్ని తప్పకుండా గౌరవించాలి: 'అయోధ్య' తీర్పుపై చంద్రబాబు ట్వీట్

  • అయోధ్య వివాదానికి ముగింపు పలికిన సుప్రీం కోర్టు
  • ట్విట్టర్ వేదికగా స్పందించిన చంద్రబాబు
  • శాంతి, సామరస్యత పాటించాలని సూచన
చారిత్రాత్మక అయోధ్య భూవివాదానికి సుప్రీం కోర్టు తెరదించిన సంగతి తెలిసిందే. ఎన్నో దశాబ్దాలుగా నలుగుతున్న వివాదాస్పద భూమి హిందువులదేనని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియ అనంతరం అంతిమ తీర్పు వెలువరించింది. దీనిపై టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. అయోధ్య అంశంపై న్యాయమూర్తుల ప్యానెల్ వెలువరించిన ఏకగ్రీవ నిర్ణయాన్ని తప్పక గౌరవించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ సమయంలో శాంతి, సామరస్యతలను పాటించాలని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.
Chandrababu
Ayodhya
Supreme Court
Telugudesam

More Telugu News