Kanchanamala: కాంచనమాల మతిస్థిమితాన్ని కోల్పోవడానికి కారణాలివేనట

  • కాంచనమాలతో వాసన్ అగ్రిమెంట్ 
  • ఆమె ధోరణిపట్ల ఆగ్రహించిన వాసన్ 
  • ఆయన నిర్ణయంతో కుంగిపోయిన కాంచనమాల
సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ మాట్లాడుతూ, కాంచనమాల మతిస్థిమితాన్ని కోల్పోవడానికి గల కారణాలను గురించి ప్రస్తావించారు. 'జెమిని' వాసన్ గారు కాంచనమాలతో 'బాలనాగమ్మ' సినిమా తీశారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో, ఆయన కాంచనామాలతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆయన నిర్మాణంలో ఆమె నాలుగైదు సినిమాలు చేయాలి. అప్పటివరకూ ఇతర నిర్మాతల సినిమాల్లో చేయకూడదు. ఒకవేళ చేస్తే వాసన్ గారి అనుమతి తీసుకోవాలి.

ఇలా అగ్రిమెంట్ జరిగిన కొన్ని రోజులకి .. తన గురించి కాంచనమాల దురుసుగా మాట్లాడినట్టు వాసన్ గారికి తెలిసింది. దాంతో ఆయన కాంచనమాలతో సినిమాలు తీసేవారు కాదు .. ఇతర నిర్మాతల సినిమాల్లో ఆమె చేయడానికి ఒప్పుకునేవారు కాదు. దాంతో ఆమె తీవ్రమైన మానసిక సంఘర్షణకి లోనైంది. అదే సమయంలో భర్త టీబీ వ్యాధితో మరణించడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. ఈ రెండు కారణాల వలన కాంచనమాల మతిస్థిమితాన్ని కోల్పోయారు" అని చెప్పారు.
Kanchanamala
Vasan

More Telugu News