Pawan Kalyan: చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

  • బంగారుపాళ్యం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
  • 12 మంది దుర్మరణం
  • పరిహారం అందించాలని పవన్ డిమాండ్
చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  బంగారుపాళ్యం మండలంలోని మొగలిఘాట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఉన్నారు.

ఈ ప్రమాదంపై పవన్ మాట్లాడుతూ.. ఇది చాలా బాధాకరమని అన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోవడం తన హృదయాన్ని ద్రవించి వేసిందన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. జనసైనికుల తరపున బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, వాహనాల ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని పవన్ డిమాండ్ చేశారు.
Pawan Kalyan
Chittoor District
Road Accident

More Telugu News