భయపెడుతున్న ‘బుల్‌బుల్’.. నేడు ఏపీలో భారీ వర్షాలు!
- పారదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం
- నేటి అర్ధరాత్రి తీరం దాటే అవకాశం
- అల్లకల్లోలంగా సముద్రం
ఈ తుపాను నేటి అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్ సాగర్ దీవులు, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో ఏపీలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే, ఒడిసా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.