Chandrababu: విపక్ష నేతపై స్పీకర్ చేయాల్సిన వ్యాఖ్యలేనా ఇవి?: తమ్మినేనిపై చంద్రబాబు మండిపాటు

  • చంద్రబాబు, లోకేశ్ పై తమ్మినేని తీవ్ర వ్యాఖ్యలు
  • హాయ్ లాండ్ భూములు కొట్టేయాలనుకున్నారని ఆరోపణ
  • ఆధారాలు కూడా ఉన్నాయని వెల్లడి
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు
అగ్రిగోల్డ్ వ్యవహారంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. హాయ్ లాండ్ భూములు కొట్టేసేందుకు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ కుట్రలకు పాల్పడ్డారంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తగిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని అన్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిపక్ష నేతపై స్పీకర్ చేయాల్సిన వ్యాఖ్యలేనా ఇవి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ అంశంలో స్పీకర్ చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవని ఆరోపించారు. జగన్ ఒక ఉన్మాది అయితే, స్పీకర్ ఇప్పుడు ఆయన్ని మించిపోవాలనుకుంటున్నారని ఆరోపించారు.

అంతేకాకుండా సీఎం జగన్ పైనా విమర్శల దాడి చేశారు. అగ్రిగోల్డ్ పై సీఎం జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అక్రమాలు మీడియాలో వస్తాయనే ఆంక్షల జీవో తీసుకువచ్చారని అన్నారు. సీఎం జగన్ ది ఆయన తాత బుద్ధి అని, అందుకే ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
Chandrababu
Agrigold
Haailand
Guntur
Jagan
Nara Lokesh
YSRCP

More Telugu News