TS RTC: తెలంగాణలో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయంపై హైకోర్టు స్టే

  • 5,100 బస్సులు ప్రవేటు రూట్లలో నడపాలన్న నిర్ణయంపై కోర్టు ఆక్షేపణ
  • తదుపరి విచారణ సోమవారానికి వాయిదా
  • కేబినెట్ తీసుకున్న నిర్ణయం కోర్టుకు తెలపాలని ఆదేశం
తెలంగాణలో 5,100 బస్సులను ప్రైవేటు రూట్లలో నడపాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని హైకోర్టు ఆక్షేపించింది. ఆ నిర్ణయంపై స్టే విధించింది. ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది.  ఆర్టీసీ రూట్ల  ప్రైవేటీకరణను నిలిపివేయాలని పిటిషనర్ కోరారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ వాదన పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
TS RTC
Routes Pritisation
State government descision
Telangana
High Court Stay

More Telugu News