Chandrababu: చంద్రబాబు దీక్షకు అనుమతి నిరాకరించిన ప్రభుత్వం

  • ఇసుక కొరతపై ఈ నెల 14న విజయవాడలో చంద్రబాబు దీక్ష
  • మున్సిపల్ స్టేడియంలో దీక్షకు అనుమతి నిరాకరణ
  • ధర్నా చౌక్ ను పరిశీలిస్తున్న టీడీపీ నేతలు
 ఈ నెల 14న విజయవాడలో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షకు సంకల్పించిన సంగతి తెలిసిందే. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీక్షకు అనుమతించాలని నగర పోలీస్, మున్సిపల్ కమిషనర్లను టీడీపీ కోరింది. అయితే, ఆయన దీక్షకు అధికారులు అనుమతి నిరాకరించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప ఇతర కార్యక్రమాలకు ఇక్కడ అనుమతి ఇవ్వలేమని వారు తెలిపారు. దీంతో, ప్రత్యామ్నాయంగా ధర్నా చౌక్ ను టీడీపీ నేతలు పరిశీలిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు దీక్ష కొనసాగుతుందని వారు తెలిపారు.
Chandrababu
Sand
Deeksha
Vijayawada
Telugudesam

More Telugu News