Chandrababu: నా ముద్ర తొలగించాలనే కక్షతో వీఓఏలను తొలగించడం దుర్మార్గం, అమానుషం: చంద్రబాబు

  • నేను పెట్టాననే అక్కసుతో డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు
  • డ్వాక్రా సంఘాలకు పార్టీలుండవు
  • వెలుగు వీఓఏలకు రాజకీయాలు తెలియవు 
  • వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు అవకాశాలు కల్పించాం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. 28 వేల మంది వీఓఏలను తొలగించడం దుర్మార్గపు చర్యని అన్నారు. 'నేను పెట్టాననే అక్కసుతో డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు పార్టీలుండవు. వెలుగు వీఓఏలకు రాజకీయాలు తెలియవు. పేదరికం నుంచి విముక్తి చేసేందుకు, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు వాళ్లకు అవకాశాలు కల్పించాం' అంటూ ఆయన ట్వీట్ చేశారు.
 
తన ముద్ర తొలగించాలనే కక్షతో 28 వేల మంది వీఓఏలను తొలగించి, వారి స్థానంలో వైసీపీ కార్యకర్తలను నియమించాలని చూడడం దుర్మార్గం, అమానుషమని చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాటానికి తెలుగుదేశం అండగా ఉంటుందని, బాధితులందరికీ భరోసా ఇస్తామని తెలిపారు.  
Chandrababu
YSRCP
Telugudesam

More Telugu News