Hyderabad: హైదరాబాదులో పేలుడు.. తీవ్రంగా గాయపడ్డ మహిళ

  • చెత్తకుప్పలో దొరికిన డబ్బాను తెరిచేందుకు యత్నించిన మహిళ
  • నేలకేసి కొట్టడంతో పేలిన డబ్బా
  • మీర్ పేట విజయపురి కాలనీలో ఘటన
హైదరాబాద్ మీర్ పేటలో ఉన్న విజయపురి కాలనీలో పేలుడు ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, చెత్త ఏరుకుంటున్న ఓ మహిళకు చెత్త కుప్పలో ఓ డబ్బా కనిపించింది. ఆ డబ్బాను ఆమె తెరిచే ప్రయత్నం చేసింది. డబ్బాను తెరిచేందుకు నేలకేసి కొట్టింది. దీంతో, భారీ శబ్దంతో డబ్బా పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనతో షాక్ తిన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ మహిళను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
Hyderabad
Blast
Woman

More Telugu News