cbi: సీబీఐ కోర్టులో విచారణకు హాజరుకాని ఏపీ సీఎం జగన్.. సరేనన్న కోర్టు!

  • ఏపీలో ఓ కేంద్ర మంత్రి పర్యటన
  • ఈ నేపథ్యంలో ఈ రోజు మినహాయింపు కోరిన జగన్
  • అభ్యర్థనను అంగీకరించిన సీబీఐ న్యాయస్థానం
అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రతి శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) న్యాయస్థానానికి హాజరవుతారన్న విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు ఆయన కోర్టులో విచారణకు హాజరుకాలేదు. ఏపీలో ఓ కేంద్ర మంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ రోజు మినహాయింపు కోరడంతో ఆయన చేసుకున్న అభ్యర్థనను సీబీఐ న్యాయస్థానం అంగీకరించింది.

అక్రమాస్తుల కేసులో తదుపరి విచారణ ఈ నెల 22కి వాయిదా పడింది. కాగా, ఈ కేసులో కోర్టు విచారణకు హాజరవడంపై తనకు మినహాయింపును ఇవ్వాలంటూ జగన్ పెట్టుకున్న పిటిషన్ ఇటీవలే న్యాయస్థానం కొట్టేసిన విషయం తెలిసిందే. కోర్టు విచారణకు హాజరుకావాల్సిందేనంటూ ఆదేశించడంతో ఇకపై ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.
cbi
Jagan
YSRCP
Andhra Pradesh
Hyderabad

More Telugu News