Deepika Padukone: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • అనుష్క పాత్రలో దీపిక?
  • మారిన 'డిస్కో రాజా' రిలీజ్ డేట్ 
  • 'క్లైమాక్స్'లో నటిస్తున్న శ్రీరెడ్డి  
     *  అనుష్క కథానాయికగా గతంలో వచ్చిన 'అరుంధతి' చిత్రం ఘన విజయాన్ని సాధించిన సంగతి విదితమే. ఇప్పుడీ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఇందులో కథానాయికగా దీపికా పదుకొనే నటిస్తుందని తాజా సమాచారం.
*  రవితేజ కథానాయకుడుగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'డిస్కో రాజా' చిత్రం రిలీజ్ డేట్ మారింది. మొదట్లో ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయడానికి ప్లాన్ చేయగా, తాజాగా వచ్చే ఏడాది జనవరి 24కి దీని విడుదలను మార్చారు.
*  తన సంచలన కామెంట్లతో నిత్యం వార్తలలో నిలిచే టాలీవుడ్ నటి శ్రీరెడ్డి తాజాగా ఓ చిత్రంలో మంచి అవకాశాన్ని పొందింది. భవానీ శంకర్ దర్శకత్వంలో రూపొందే 'క్లైమాక్స్' చిత్రంలో సినిమా నటి పాత్రలో ఆమె కనిపిస్తుంది. ఇందులో రాజేంద్రప్రసాద్, పృథ్వీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 
Deepika Padukone
Anushka Shetty
Raviteja
Srireddy

More Telugu News