Himachal Pradesh: రోడ్డుపక్క హోటల్ లో పనికి కుదిరిన కోటీశ్వరుడి కుమారుడు!

  • ఇంజనీరింగ్ చదువుతున్న ద్వారకేశ్
  • స్వయంగా బతకాలన్న కోరికతో బయటకు
  • సిమ్లాలో హోటల్ లో పని
కాలు బయటపెడితే ఖరీదైన కార్లు, ఇంటినిండా నౌకర్లు... కానీ ఆ యువకుడికి ఇవేమీ పట్టలేదు. ఇంజనీరింగ్ చదువుతున్నా, స్వయంగా తన కాళ్ల మీద తాను నిలబడాలన్న కోరిక అతన్ని ఇంటి నుంచి వెళ్లిపోయేలా ప్రేరేపించింది. అతనే ద్వారకేశ్ టక్కర్. వడోదరా జిల్లాలోని పద్రా పట్టణానికి చెందిన ఓ కోటీశ్వరుడి కుమారుడు. చదువుకోవడం ఇష్టం లేక ఇంటి నుంచి బయటకు వచ్చేసి, నేరుగా సిమ్లా వెళ్లిపోయాడు.

అక్కడ ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని ఓ హోటల్ మేనేజర్ ను అడుగగా, అతని వాలకంపై అనుమానం వచ్చిన మేనేజర్, ఐడీ కార్డు అడిగాడు. దాన్ని చూసిన తరువాత పద్రా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి వెళ్లేసరికి ద్వారకేశ్ పారిపోయాడు. అతని కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టగా, రోడ్డు పక్కన ఉన్న చిన్న హోటల్ లో అంట్లు కడుగుతూ కనిపించాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, విషయాన్ని కుటుంబీకులకు తెలియజేశారు.
Himachal Pradesh
Dwarakesh
Billioner

More Telugu News