Ganta Srinivasa Rao: రామ్ మాధవ్ తో మంతనాలు... బీజేపీలోకి గంటా శ్రీనివాస్!

  • గంటాతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా
  • అనర్హత వేటుపై ఆందోళనలో ఎమ్మెల్యేలు
  • రెండు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన గంటా
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. తనతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలను కూడా ఆయన తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌ తో ప్రత్యేకంగా భేటీ అయి, మంతనాలు జరిపారు. ప్రస్తుతానికి గంటాతో పాటు ఎవరెవరు కమలం గూటికి చేరతారన్న విషయంలో స్పష్టత రాలేదు. పార్టీ మారితే తమపై పడే అనర్హత వేటు, తదనంతర పరిణామాలపై వారు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.

కాగా, గడచిన రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన గంటా శ్రీనివాస్, ఇప్పటికే సుజనా, సీఎం రమేశ్‌ తదితరులతో కూడా చర్చలు జరిపారు. అతి త్వరలో పార్టీ మార్పుపై గంటా స్వయంగా ప్రకటన చేస్తారని ఆయన అనుచరవర్గం అంటోంది.
Ganta Srinivasa Rao
Ram Madhav
BJP

More Telugu News