Andhra Pradesh: ఏపీలో వాగులోకి దూసుకుపోయిన బస్సు

  • ఒక పక్కకు ఒరిగి ఆగిపోవడంతో తప్పిన ప్రమాదం
  • 42 మంది ప్రయాణికులు సురక్షితం
  • స్థానికుల సహాయంతో ఒడ్డుకు చేరిన ప్రయాణికులు
ఆంధ్రప్రదేశ్ లో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకుపోయింది. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు కాలువలోకి దూసుకుపోయి ఒక పక్కకు ఒరిగిపోయి ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పిపోయింది. బస్సులో 42 మంది ప్రయాణికులున్నారు. ప్రయాణికులు బయటకు రావడానికి స్థానికులు సహాయం చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

Andhra Pradesh
RTC
Bus accident
Anantapur District
vidapanakallu mandal

More Telugu News