Roja: జగన్ చల్లని పాదం మోపడంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి: రోజా

  • తాజా పరిణామాలపై రోజా స్పందన
  • చంద్రబాబు, పవన్ రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపణ
  • చంద్రబాబు చిన్న మెదడు చితికిందంటూ వ్యంగ్యం
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా స్పందించారు. జగన్ చల్లని పాదం మోపడంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయని, దాంతో ఇసుకకు కొద్దిమేర ఇబ్బంది ఏర్పడిందని అన్నారు. అయితే దీనిపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. విపక్ష నేతలు వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. ఎన్నికల్లో ఓటమి కారణంగా చంద్రబాబుకు మతిభ్రమించినట్టుందని, చిన్న మెదడు చితికిందని ఎద్దేవా చేశారు. ఏపీలో జగన్ పాలన చూసి పొరుగు రాష్ట్రాల వారు కూడా జగన్ లాంటి ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నారని రోజా అన్నారు.
Roja
YSRCP
Jagan
Chandrababu
Pawan Kalyan
Andhra Pradesh

More Telugu News