Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ గవర్నర్ పై దాడులు చేయండి: ఉగ్రమూకలకు ఐఎస్ఐ ఆదేశాలు

  • ఉగ్ర సంస్థలతో ఐఎస్ఐ సమావేశం
  • గిరీశ్ చంద్ర ముర్ముపై దాడి చేయాలంటూ ఆదేశం
  • టెర్రరిస్టుల హిట్ లిస్టులో బీజేపీ కీలక నేతలు
జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీశ్ చంద్ర ముర్మును పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ టార్గెట్ చేసిందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. లష్కరే తాయిబా, హజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థలతో ఐఎస్ఐ సమావేశమయిందని... గిరీశ్ చంద్రపై దాడులు చేయాలంటూ ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేసిందని తెలిపింది. పీవోకేలోని కోట్లి ప్రాంతంలో ఈ సమావేశం జరిగిందని వెల్లడించింది.

ఇటీవల జరిగిన బ్లాక్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు కూడా ఉగ్రవాదుల లిస్ట్ లో ఉన్నట్టు ఇంటెలిజెన్స్ తెలిపింది. జమ్మూకశ్మీర్ లోని బీజేపీ కీలక నేతలు కూడా టెర్రరిస్టుల హిట్ లిస్టులో ఉన్నారని పేర్కొంది.
Jammu and Kashmir
Girish Chandra Murmu
ISI
Governor
Lashkar-e-Taiba
Hizbul Mujahideen
Pakistan

More Telugu News