Mahesh Babu: అమ్మ కంటే మిన్నగా మరెవరు చూసుకుంటారు?: టాలీవుడ్ ఎంట్రీ సందర్భంగా మహేశ్ మేనల్లుడు ట్వీట్

  • టాలీవుడ్ కు పరిచయం అవుతున్న అశోక్ గల్లా
  • ఈ నెల 10న సినిమా ప్రారంభం
  • ఎంతో ఉద్విగ్నంగా ఉంది అంటూ అశోక్ స్పందన
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అశోక్ గల్లా మహేశ్ బాబు సోదరి పద్మావతి, ఎంపీ గల్లా జయదేవ్ ల తనయుడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంతో అశోక్ గల్లా తెరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమాకు అశోక్ తల్లి పద్మావతి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 10న సినిమా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అశోక్ గల్లా ట్వీట్ చేశాడు. "తల్లి కంటే మిన్నగా మన బాగోగులు చూసుకునేవాళ్లు ఇంకెవరుంటారు? థాంక్యూ అమ్మా, నా కలను నిజం చేస్తున్నావు. థాంక్యూ కెప్టెన్ శ్రీరామ్ ఆదిత్య, ఎంతో ఉద్విగ్నంగా ఉంది" అంటూ తన స్పందన వెలిబుచ్చాడు.
Mahesh Babu
Padmavathi Galla
Ashok Galla
Galla Jaydev
Tollywood
Sriram Adithya

More Telugu News