విజయారెడ్డి హత్యకు కేసీఆర్ వ్యాఖ్యలే కారణం: వీహెచ్
- లంచం అడిగే అధికారులను కొట్టాలని గతంలో కేసీఆర్ చెప్పారు
- విజయారెడ్డి హత్యపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి
- రెవెన్యూ కార్యాలయాలకు భద్రత కల్పించాలి
రెవెన్యూ శాఖలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని వీహెచ్ అభిప్రాయపడ్డారు. రెవెన్యూ కార్యాలయాలకు ఒక కానిస్టేబుల్ తో భద్రత కల్పించాలని చెప్పారు. రెవెన్యూ శాఖలో లోటుపాట్లు, భూముల ధరలు విపరీతంగా పెరగడం వల్లే ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతున్నాయని అన్నారు.