Chandrababu: తప్పుడు కేసులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు: వైసీపీపై చంద్రబాబు ఆగ్రహం

  • ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు
  • అలాచేస్తే రాష్ట్రంలో తమ అక్రమాలకు అడ్డు ఉండదని వైసీపీ భావిస్తోంది
  • వైఖరిని మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోకతప్పదు
ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తే రాష్ట్రంలో తాము చేసే అక్రమాలకు అడ్డు ఉండదని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆ పార్టీ నేతలు తమ వైఖరిని మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం ఐతేపల్లిలో ఈ రోజు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైసీపీ నేతల చేతిలో బాధితులుగా మారిన ప్రజల సమస్యలను గురించి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... పోలీసులు కొందరిపై తప్పుడు కేసులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ సర్కారు చేస్తోన్న తప్పులను బయటకు తెలియనివ్వకుండా దాచడానికి అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు.
Chandrababu
YSRCP
Andhra Pradesh
Telugudesam

More Telugu News