New Delhi: మహిళా పోలీసుపై దాడి చేసి, లోడెడ్ గన్ ను తీసుకుపోయిన ఢిల్లీ లాయర్లు!

  • తీస్ హజారీ ప్రాంతంలో ఘటన
  • ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయని పోలీసులు
  • తమపై ఒత్తిడి ఉందంటున్న అధికారులు
న్యూఢిల్లీలో పోలీసులు, లాయర్లకు మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో తీసిన ఓ వీడియో ఇప్పుడు షాకింగ్ కు గురి చేస్తోంది. యూనిఫామ్ ధరించిన ఓ మహిళా పోలీసు అధికారిణిని చుట్టు ముట్టి, దాడి చేసిన కొందరు లాయర్లు, ఆమె వద్ద లోడ్ చేసి వున్న గన్ ను ఎత్తుకుపోయారు. ఢిల్లీలోని తీస్ హజారీ ప్రాంతంలో ఈ ఘటన జరుగగా, మహిళా పోలీసు అధికారిణి ఉన్నతాధికారులకు కంప్లయింట్ చేశారు.

 తనవద్ద ఉన్న 9 ఎంఎం సర్వీస్ ఫిస్టల్ శనివారం నుంచి కనిపించడం లేదని ఆమె ఫిర్యాదు చేయగా, ఇంతవరకూ పోలీసులు కేసును రిజిస్టర్ చేయలేదని తెలుస్తోంది. అమె లిఖిత పూర్వకంగా ఇంకా ఫిర్యాదు చేయని కారణంగానే ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని ఓ అధికారి చెప్పడం గమనార్హం. ఆమె లైంగిక వేధింపులకు గురి కాలేదని, అందువల్ల తాము ఎలాంటి చర్యలూ స్వయంగా తీసుకోలేమని ఆయన అన్నారు. లాయర్ల నిరసనల వ్యవహారం సున్నితమైన విషయమైనందున తమపై ఒత్తిడి అధికంగా ఉందని మరో అధికారి వ్యాఖ్యానించారు.
New Delhi
Police
Lady Officer
Lawyers
Gun

More Telugu News