Minister anilkumar yadav: మంత్రిగారూ...మాగోడు వినండి: ఏపీ మంత్రి అనిల్‌ కాన్వాయ్‌ని అడ్డుకున్న శ్రీశైలం ముంపు బాధిత నిరుద్యోగులు

  • ఉద్యోగాల కోసం ప్రభుత్వానికి వేడుకోలు
  • 60 రోజులుగా దీక్ష చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన
  • సానుకూలంగా స్పందించిన అమాత్యులు
శ్రీశైలం ప్రాజెక్టు పుణ్యాన సర్వం కోల్పోయిన తాము నలభై ఏళ్లుగా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నామని, తమకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని ముంపు బాధిత నిరుద్యోగులు భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు మొరపెట్టుకున్నారు.

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వాముల దర్శనార్థం వచ్చిన మంత్రి కర్నూల్‌లో జరిగే సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా దారి మధ్యలో నిరుద్యోగులు ఆయన కాన్వాయిని అడ్డుకున్నారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ 60 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించని విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తమ గోడు విని న్యాయం చేయాలని ఆయనకు వినతిపత్రం అందించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని తెలిపారు.
Minister anilkumar yadav
Kurnool District
srisailam
unemployees

More Telugu News