Campus Interviews: ఢిల్లీ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థినికి రూ.1.45 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం

  • ఆఫర్‌ చేసిన ఫేస్‌బుక్‌ సంస్థ
  • క్యాంపస్‌ ఇంటర్వ్యూలో జాక్‌పాట్‌ కొట్టిన కంప్యూటర్‌ సైన్స్‌ బాలిక
  • మొత్తం 562 మందికి ఉద్యోగాలిచ్చిన పలు సంస్థలు
ఓ ట్రిపుల్‌ ఐటీ కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థినికి ఫేస్‌బుక్‌ సంస్థ దాదాపు కోటిన్నర వార్షిక వేతనం ఇచ్చి కొలువుకు స్వాగతం పలికింది. దేశరాజధాని ఢిల్లీలోని ఈ కళాశాలలో ఇటీవల జరిగిన క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఆమె ప్రతిభకు ఈ జాక్‌పాట్‌ తగిలింది. నెలకు సగటున 12 లక్షల  రూపాయల వేతనం ఆమె డ్రా చేయనుంది. 2020 బ్యాచ్‌కి సంబంధించి నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఫేస్‌బుక్‌తోపాటు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, అడోబ్‌, రిలయెన్స్‌, శ్యామ్‌సంగ్‌ ఆర్‌ అండ్‌ డీ విభాగాలు విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. మొత్తం 562 మందికి ఉద్యోగాలు లభించగా, వీరిలో 310 మందికి ఫుల్‌టైం, 210 మందికి ఇంటర్న్‌షిప్‌లు లభించాయి. ఉద్యోగాలు లభించిన వారికి సగటున రూ.33 లక్షల నుంచి రూ.43 లక్షల వార్షిక వేతనం దక్కిందని ఢిల్లీలోని ట్రిపుల్‌ ఐటీ యాజమాన్యం తెలిపింది.
Campus Interviews
Facebook
Delhi Tripul IT
JOB
1.45 crores pakage

More Telugu News