Rahul Sipliganj: 'అయామ్ ఇన్ లవ్... పేరు మాత్రం చెప్పలేను': 'బిగ్ బాస్' విజేత రాహుల్ సిప్లిగంజ్

  • తప్పనిసరిగా ప్రేమ వివాహమే చేసుకుంటా
  • పునర్నవితో ప్రేమ వ్యవహారం లేదు
  • పాతబస్తీలో ఇరానీ చాయ్ ఇష్టమన్న రాహుల్
తాను ప్రేమలో పడ్డానని, అయితే, ఎవరితో ప్రేమలో పడ్డానో మాత్రం ఇప్పుడే చెప్పలేనని, తాను తప్పనిసరిగా ప్రేమ వివాహమే చేసుకుంటానని టాలీవుడ్ బిగ్ బాస్ సీజన్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్ వ్యాఖ్యానించాడు. విజేతగా నిలిచిన అనంతరం ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన రాహుల్, పలు విషయాలను పంచుకున్నాడు. తనకు, పునర్నవి మధ్య ఎటువంటి ప్రేమ వ్యవహారాలూ నడవలేదని అన్నాడు.

తాను విజేతగా నిలిచానని తెలియగానే, మైండ్ బ్లాంక్ అయిందని, శ్రీముఖి తనను అభినందించిందా? లేదా? అన్న విషయం కూడా గుర్తు లేదని అన్నాడు. తాను పాతబస్తీకి చెందిన వాడినని గుర్తు చేస్తూ, తన ఇంటికి ఫ్యాన్స్ వెల్లువెత్తగా, గోడ దూకి బయటపడ్డానని అన్నాడు. రాత్రి పూట పాతబస్తీలో తిరుగుతూ, స్నేహితులతో కలిసి ఇరానీ చాయ్ తాగడం ఎంతో ఇష్టమని చెప్పాడు. సినిమాల్లో నటించాలన్న కోరిక తనకు లేదని, తెలుగు పాప్ ఆర్టిస్టుగానే కొనసాగుతానని రాహుల్ అన్నాడు.
Rahul Sipliganj
Biggboss
Punarnavi

More Telugu News