Somireddy: రైతుల త్యాగాలనూ అవమానించేలా సర్కారు వ్యవహరించడం దురదృష్టకరం: సోమిరెడ్డి

  • భారీ భవంతుల నిర్మాణం జరుగుతోంటే వైసీపీ ఓర్చుకోలేక పోతోంది
  • ప్రజా రాజధాని కోసం రైతులు భూములను అప్పగించారు
  • భవనాలన్నింటినీ కళ్లకు కట్టినట్టు మీడియా ప్రజల ముందుంచింది
  • మీడియాపై జీఓ2430 ప్రయోగించినా ఆశ్చర్యపోనక్కరలేదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అమరావతిపై వైసీపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ... 'ప్రజల కలల రాజధానిలో భారీ భవంతుల నిర్మాణం జరుగుతోంటే వైసీపీ ప్రభుత్వం ఓర్చుకోలేక నిర్వీర్యం చేయాలనుకోవడం దుర్మార్గం. ప్రజా రాజధాని కోసం భూములను అప్పగించిన రైతుల త్యాగాలనూ అవమానించేలా వ్యవహరించడం దురదృష్టకరం' అని ఆయన ట్వీట్ చేశారు.
 
అమరావతి భవనాల గురించి కథనాలు ప్రచురించిన మీడియాపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం లేకపోలేదంటూ సోమిరెడ్డి ఆరోపించారు. 'అమరావతిలో వేలాది కోట్లతో అద్భుతమైన కట్టడాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయని ఇప్పటి వరకు బహుశా వైసీపీ శ్రేణులకు తెలియదేమో. ఆ భవనాలన్నింటినీ కళ్లకు కట్టినట్టు ప్రజల ముందుంచిన మీడియాపైనా జీఓ2430 ప్రయోగించినా ఆశ్చర్యపోనక్కరలేదు' అని సోమిరెడ్డి విమర్శించారు. 
Somireddy
YSRCP

More Telugu News