Jana Sena: జాలేస్తోంది... వైసీపీ నేతల మెదడు ఇంతేనా?: జనసేన

  • నిలదీస్తుంటే సమాధానాలు చెప్పలేక పోతున్న వైసీపీ
  • వ్యక్తిగత విమర్శలతో కాలం గడుపుతున్నారు
  • వారిని చూసి జాలిపడాలన్న జనసేన
తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, సమాధానాలు చెప్పలేకపోతున్నారని అంటూ వైసీపీపై జనసేన విమర్శలు గుప్పించింది. ప్రశ్నలకు సమాధానం లేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించింది. ఈ మేరకు పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఒక్కడంటే ఒక్క వైసీపీ నాయకుడు కూడా వాటికి సరైన సమాధానం చెప్పలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. వారి మెదడు ఇంతేనేమో అని జాలిపడాల్సిందే" అని వ్యాఖ్యానించింది. ఇటువంటి వైసీపీ నాయకులను చూసి కోప్పడవద్దని, వారి మెదడు ఇంతేనా అని జాలి పడాలని చెబుతూ, ఓ కార్టూన్ కూడా పోస్ట్ చేసింది.
Jana Sena
YSRCP
Pawan Kalyan
Twitter

More Telugu News