Ntr: 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో 7 పాటలు

  • షూటింగు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
  • 3 పాటలు రాసిన సుద్దాల అశోక్ తేజ 
  •  సంగీత దర్శకుడిగా కీరవాణి 
ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందుతోంది. చరణ్ జోడీగా అలియా భట్ నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికి కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాలో ఎన్ని పాటలు ఉంటాయా అనే ఆసక్తి అభిమానుల్లో వుంది. ఏడు పాటలు వుంటాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

దేశభక్తిని .. చైతన్య స్ఫూర్తిని రగిల్చే పాటలు రెండు మూడు ఉంటాయనీ, తన జోడీతో చరణ్ .. తన జోడీతో ఎన్టీఆర్ పాడుకునే రొమాంటిక్ సాంగ్స్ వుంటాయని చెబుతున్నారు. ఈ ఏడు పాటల్లో సుద్దాల అశోక్ తేజ 3 పాటలను రాయడం జరిగింది. తనదైన బాణీలతో కీరవాణి మంత్రముగ్ధులను చేయనున్నాడని అంటున్నారు. అటు సన్నివేశాలను .. ఇటు పాటలను బ్యాలెన్స్ చేస్తూ రాజమౌళి ఈ కథను రక్తి కట్టించనున్నారన్నమాట.
Ntr
Charan

More Telugu News