MLA Manchireddy kishan reddy: విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్ టీఆర్ఎస్ కార్యకర్త అంటూ ప్రచారం.. ఖండించిన ఎమ్మెల్యే!

  • ఎమ్మెల్యే మంచిరెడ్డితో ఉన్న ఫొటో వైరల్
  • ఎన్నికల్లో ఆయన తరపున ప్రచారం
  •  సురేశ్‌కు అసలు సభ్యత్వమే లేదన్న ఎమ్మెల్యే
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కేసులో నిందితుడైన కూర సురేశ్‌ టీఆర్ఎస్ కార్యకర్త అన్న ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో ఉన్న ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎన్నికల సమయంలో మంచిరెడ్డికి అనుకూలంగా అతడు ప్రచారం చేసినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం వివాదంలో ఉన్న భూముల విషయంలో తమకు సహకరించాల్సిందిగా కోరుతూ సురేశ్ కుటుంబ సభ్యులు మొత్తం ఆయనకు మద్దతుగా పనిచేసినట్టు చెబుతున్నారు. అయితే, ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌కు వారు దూరమైనట్టు తెలుస్తోంది. సురేశ్ విషయంలో వైరల్ అవుతున్న వార్తలపై ఎమ్మెల్యే మంచిరెడ్డి స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని, సురేశ్‌కు అసలు పార్టీ సభ్యత్వమే లేదని తేల్చి చెప్పారు.
MLA Manchireddy kishan reddy
kura suresh
TRS

More Telugu News