america: ఐసిస్ చీఫ్ బగ్దాదీ భార్యను పట్టుకున్నాం: టర్కీ

  • బగ్దాదీ విషయంలో అమెరికా ప్రచారం చేసినట్టు మేం చేసుకోం
  • బగ్దాదీ సోదరి, బావను కూడా పట్టుకున్నాం
  • అమెరికాపై ఎర్డోగన్ విమర్శలు
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ భార్య తమ అదుపులో ఉన్నట్టు టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ ప్రకటించారు. అంకారాలోని ఓ యూనివర్సిటీలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. బగ్దాదీ భార్యను పట్టుకున్నామని, అలాగే సిరియాలో అతడి సోదరి, బావను కూడా తాము అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు.

తమ బలగాల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో బగ్దాదీ సొరంగంలోకి వెళ్లి తనను తాను కాల్చుకుని చనిపోయాడని అమెరికా ప్రచారం చేసుకున్నట్టుగా, ఈ విషయంలో తాము ప్రచారం చేసుకోబోమని అంటూ ట్రంప్‌ను విమర్శించారు.
america
ISIS
turkey
erdogan
Donald Trump

More Telugu News