Bigg Boss: చిరంజీవి గారు ఓ పాట చేయాలని అడిగారు... అది లైవ్ లో చూపించలేదు: బాబా భాస్కర్

షార్ట్స్‌లో చూడండి
బిగ్ బాస్ రియాల్టీ షో మూడో సీజన్ ముగియడంతో మీడియా చానళ్లలో కంటెస్టెంట్లు ఇంటర్వ్యూలతో సందడి చేస్తున్నారు. గ్రాండ్ ఫినాలేలో టాప్-3లో ఒకడిగా నిలిచిన ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ ఓ చానల్ తో మాట్లాడుతూ, గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో కొన్ని అంశాలు లైవ్ లో చూపించలేదని వెల్లడించారు. ముఖ్యంగా, మెగాస్టార్ చిరంజీవి తనతో మాట్లాడిన కొన్ని మాటలు ప్రసారం కాలేదని తెలిపారు.

"చాలాకాలం తర్వాత నేను మళ్లీ సినిమాల్లోకి వచ్చాను, ఖైదీ నెం.150 సినిమా కూడా చేశాను. నా కొత్త సినిమా కోసం ఓ పాట చేస్తావా? అని చిరంజీవి గారు అడిగారు. తప్పకుండా చేస్తాను సార్, మీరు అడిగితే చేయకపోవడం ఏంటి సార్" అన్నానని బాబా వివరించారు. ఇది తాను హౌస్ లో ఉన్నప్పుడు చిరంజీవి గారు స్టేజ్ మీద ఉండి అడిగారని తెలిపారు. ఇక స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత, నేను మీ ఫ్యాన్ ను సార్ అంటే, నేనే మీకు పెద్ద ఫ్యాన్ ను బాబా అని చిరంజీవి గారు అనడం మర్చిపోలేనని వెల్లడించారు.
Go Back to Shorts
Bigg Boss
Baba Bhaskar
Chiranjeevi
Tollywood

More Telugu News