TSRTC: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేంద్రం స్పందిస్తుంది: నిజామాబాద్ ఎంపీ అరవింద్

  • ఆర్టీసీ సమ్మెపై నిజామాబాద్ ఎంపీ స్పందన
  • కేంద్ర చట్టాన్ని కేసీఆర్ ఉపయోగించుకోలేకపోతున్నాడని విమర్శ
  • తన అసమర్థతను కేంద్రంపై నెడుతున్నాడని ఆరోపణ
నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఓ తండ్రిగా కేంద్రం చేసిన చట్టాన్ని కేసీఆర్ వంటి చెడ్డబ్బాయి ఉపయోగించుకోలేకపోతున్నాడని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తన చేతకానితనాన్ని కేంద్రంపై నెడుతున్నారని ఆరోపించారు.

ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఆర్టీసీ కార్మికులకు ఉందని, కార్మికుల సమ్మెపై కేంద్రం స్పందిస్తుందని తెలిపారు. కేంద్ర చట్టాన్ని కేసీఆర్ చదవకుండానే మాట్లాడుతున్నారని విమర్శించారు. అంతకుముందు రోజు ఆయన ఇదే అంశంపై స్పందించారు. కేంద్రం తీసుకువచ్చిన మోటార్ వెహికిల్ చట్టంలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని ఎక్కడా లేదని అన్నారు.
TSRTC
Telangana
KCR
Aravind
BJP

More Telugu News