Sundeep Kishan: 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వేదిక ఖరారు

షార్ట్స్‌లో చూడండి
సందీప్ కిషన్ కథానాయకుడిగా దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' సినిమాను రూపొందించాడు. ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా కూడా సందీప్ కిషన్ వ్యవహరించాడు. ఆయన జోడీగా హన్సిక నటించగా, కీలకమైన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనుంది. ఈ నెల 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

 ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసింది. ఈ నెల 9వ తేదీన కర్నూల్ లోని ఎస్.టి.బి.సి కాలేజ్ గ్రౌండ్ ఈ వేడుకకి వేదిక కానుంది. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుంది. పూర్తి వినోదభరితంగా నిర్మితమైన ఈ సినిమాపై సందీప్ కిషన్ ఆశలు పెట్టుకున్నాడు. ఆయన ఆశలను ఈ సినిమా నెరవేరుస్తుందేమో చూడాలి. ఇక సందీప్ కిషన్ తదుపరి చిత్రంగా 'A1 ఎక్స్ ప్రెస్' సెట్స్ పైకి వెళుతోంది. 'నట్పు తునై' అనే తమిళ హిట్ మూవీకి ఇది రీమేక్.
Go Back to Shorts
Sundeep Kishan
Hansika

More Telugu News