Jana Sena: జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ నూతన సభ్యులు వీరే!
- కొత్తగా నలుగురు సభ్యులకు స్థానం
- నాదెండ్ల నేతృత్వంలో కొనసాగుతున్న రాజకీయ కమిటీ
- ట్విట్టర్లో కొత్త సభ్యుల పేర్లు వెల్లడించిన పవన్
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీని మరింత విస్తరిస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా మరో నలుగురు సభ్యులకు స్థానం కల్పించారు. పంతం నానాజీ, మధుసూదన్ రెడ్డి, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పితాని బాలకృష్ణలను జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ వీరి పేర్లను తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ కార్యక్షేత్రంలో దిగిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా, విశాఖలో లాంగ్ మార్చ్ ను గ్రాండ్ సక్సెస్ చేసినందుకు సత్య బొలిశెట్టి, శివశంకర్ తమ్మిరెడ్డిలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని, త్వరలోనే వీరిద్దరికీ పార్టీలో కీలకపదవులు అప్పగిస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా వీరి పదవులు ఉంటాయని పేర్కొన్నారు.