Jagan: జగన్ గారూ, ఐదేళ్లలో ఎవరూ బతికి బట్టకట్టే పరిస్థితి లేదంటున్నారు ప్రజలు: నారా లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
పాలన పగ్గాలు చేపట్టిన ఐదు నెలల్లోనే ఇంత దారుణమైన పరిస్థితులు తీసుకువస్తే, ఐదేళ్లలో ఎవరూ బతికి బట్టకట్టే పరిస్థితి ఉండదని ప్రజలు అనుకుంటున్నారు జగన్ గారూ అంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. మిమ్మల్ని నమ్మి మీకు ఓటేస్తే ప్రజలను ఇలా మృత్యువు ముంగిట నిలబెడతారా? ఇన్ని రకాలుగా ప్రజలను బాధపెడుతున్న మీకు నిద్రెలా పడుతోంది? కొంచెం అయినా మానవత్వం చూపించండి! అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబానికి చెందిన ఓ మహిళ ఎంతో ఆవేదనతో సీఎం జగన్ ను ప్రశ్నిస్తున్న వీడియోను కూడా లోకేశ్ తన ట్వీట్ కు జోడించారు.
Go Back to Shorts
Jagan
Nara Lokesh
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News